MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 8:03 pm Posted by : MANA TOLIVELUGU

పోలియో రహిత భువనగిరి మన లక్ష్యం 

మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్

భువనగిరిలో ఘనంగా పల్స్ పోలియో 

చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసిన మున్సిపల్ చైర్ పర్సన్

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ : 

పట్టణంలోని వివిధ వార్డుల్లో పల్స్ పోలియో కార్యక్రమం శనివారం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ 35, 10, 18 వ తదితర వార్డుల్లో ఉన్న పోలియో వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించారు. ప్రతి కేంద్రంలోనూ 5 సంవత్సరాల లోపు చిన్నారులకు చైర్ పర్సన్ స్వయంగా పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ.. పోలియో వ్యాధి శాశ్వత వైకల్యానికి కారణమవుతుందని, దీన్ని పూర్తిగా రూపుమాపడమే మనందరి ధ్యేయమన్నారు. ప్రతి ఇంట్లోని 5 సంవత్సరాల లోపు బిడ్డకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, ఏ ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకూడదన్నారు. భువనగిరిని 100 శాతం పోలియో రహిత పట్టణంగా చేయడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ తంగళ్ళపల్లి రవి కుమార్, స్థానిక కౌన్సిలర్లు పాశం అమర్, బింగి నరేష్, యాస్మిన్, స్థానిక నాయకులు పలువురు మహిళలు, చిన్నారులు, పోలియో నిర్వహణ సిబ్బంది, ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.